ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈ-ఎఫ్ఎం.. సందడిగా ఏడాది సంబరం

పెద్దలు మెచ్చే జానపదాలు, యువతను ఉర్రూతలూగించే పాటలతో శ్రోతలకు చేరువైన ఈ ఎఫ్ఎమ్​.. ఏడాది పుర్తి చేసుకుంది.

వేడుక చేసుకుంటున్న సిబ్బంది

By

Published : Jul 5, 2019, 7:45 PM IST

Updated : Jul 5, 2019, 7:53 PM IST

ఘనంగా ఈఎఫ్​ఎమ్ వార్షికోత్సవం

రామోజీ గ్రూపు సంస్థకు చెందిన ‘ఈనాడు ఎఫ్‌ఎం (ఈఎఫ్‌ఎమ్)’ విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకుంది. విభిన్న కార్యక్రమాలతో శ్రోతలను ఆకట్టుకుంటోన్న ఈ- ఎఫ్ఎం వార్షికోత్సవం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఘనంగా జరిగింది. ఈఎఫ్​ఉద్యోగులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. సంవత్సరంలోనే ప్రజలకు చాలా చేరువయ్యామని వారు ఆనందం వ్యక్తం చేశారు. ఇదే ఉత్సాహంతో సరికొత్త కార్యక్రమాలను రూపొందిస్తామని తెలిపారు.

4 కేంద్రాల్లో.. విజయవంతంగా..

తెలుగు రాష్ట్రాల్లో... విజయవాడ, వరంగల్‌, రాజమహేంద్రవరం, తిరుపతిలలో ఈఎఫ్‌ఎం స్టేషన్లు ఏర్పాటయ్యాయి. ప్రారంభించి ఏడాది కాకముందే జాతీయస్థాయిలో గుర్తింపు ఈ-ఎఫ్ఎం సంపాదించింది. ఇండియన్‌ రేడియో ఫోరం (ఐఆర్‌ఎఫ్‌) ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని సొంతం చేసుకుంది. ఎక్సలెన్స్‌ ఇన్‌ రేడియో అవార్డ్సు 2019 ఈఎఫ్‌ఎంను వరించింది. బెస్ట్‌ న్యూలాంచ్‌ ఎఫ్‌ఎం స్టేషన్‌ విభాగంలో సిల్వర్‌ అవార్డు సాధించింది. చర్చావేదికలు, సంగీత అభిమానులకు ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సూచనలు, ‘ఆంధ్రా అత్త - తెలంగాణ కోడలు’ వంటి కార్యక్రమాలను రూపొందించింది శ్రోతల అభిమానాన్ని చూరగొంది.

Last Updated : Jul 5, 2019, 7:53 PM IST

ABOUT THE AUTHOR

...view details