రెండేళ్లలో పాఠశాలల ముఖచిత్రాన్ని మార్చేస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో రేషనలైజేషన్ కింద 6 వేలకు పైగా పాఠశాలలను మూసివేశారని, ఆ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందన్నదీ పరిశీలించాల్సి ఉందని అన్నారు. ఏపీ బడ్జెట్‌పై చర్చలో భాగంగా అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన అత్యంత అవసరమన్నారు. టెండర్లపై ధ్యాస తప్ప పారిశుద్ధ్య కార్మికులను గత ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదని ఆరోపించారు.
'రెండేళ్లలో పాఠశాలల రూపరేఖలు మార్చుతాం' - Aadimulapu suresh
గత ప్రభుత్వ హయాంలో రేషనలైజేషన్ కింద 6 వేలకు పైగా పాఠశాలలను ఎందుకు మూసివేశారో పరిశీలించాల్సి ఉందని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. రెండేళ్లలో పాఠశాలల ముఖ చిత్రాన్ని మార్చేస్తామని అసెంబ్లీలో అన్నారు.
'రెండేళ్లలో పాఠశాల రూపరేఖలు మార్చుతాం'