ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వ సంకల్పం.. పేదలకు పెద్ద చదువుల వరం - ap elections 2019

ఒకప్పుడు విదేశాల్లో చదువుంటే.. మధ్యతరగతి ప్రజలు ఆ ఆలోచన కూడా చేసేవారు. బాగా  ధనవంతులతే అది సాధ్యం అని నమ్మేవాళ్లు. కానీ ఇప్పుడు బడుగుల బిడ్డలు ప్రపంచాన్ని చుట్టొస్తున్నారు. ఫేమస్ వర్సిటీల్లో ఎమ్మెస్, ఎంబీబీఎస్ చేస్తున్నారు.  నాలుగేళ్లలో వచ్చిన మార్పు ఇది. పేద పిల్లలకు  పెద్ద చదువులు అందించాలన్న  చంద్రబాబు సంకల్పం ఇది..!

chandrababu

By

Published : Apr 6, 2019, 4:55 PM IST

పేద విద్యార్థులకు పెద్ద చదువులు

ఆర్థిక భారం ఉన్నత చదువుని దూరం చేయకూడదని భావించింది.. తెదేపా ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చాక.. అద్భుత పథకానికి రూపనకల్పన చేసింది. పేద విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు సాయం అందిస్తోంది. విద్యాదీనెన పేరుతో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు సాయం అందిస్తోంది.

పేదలకు వరంగా విదేశీ విద్యా దీవెన

13జిల్లాలు..4528మంది విద్యార్థులు..377.7కోట్ల రూపాయలు..ఇదీ విద్యాదీవెన.. వ్యయం . ఒక్కో విద్యార్థిపై 15లక్షల వరకూ ఖర్చు చేసింది ప్రభుత్వం. పేద విద్యార్థులకు నిజంగా ఈ పథకం దీవెనే. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ, కాపు, బ్రాహ్మణ విద్యార్థులకు ఆర్థికంగా అండగా నిలుస్తూ..ఉన్నతి స్థాయికి తెలుగుదేశం ప్రభుత్వం తీసుకెళ్తోంది. అమెరికా, యూకే, ఫ్రాన్స్, రష్యా, ఇటలీ, నెదర్లాండ్స్, ఐర్లండ్, పోలెండ్, ఉక్రెన్, కిజికిస్తాన్, నార్వే లోని ఇలా ప్రపంచ నలుమూలల్లోని మరెన్నో దేశాల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు అడుగుపెట్టారు. ప్రముఖ వర్సిటీల్లో ఎంబీబీఎస్, ఎమ్మెస్ విద్యను అభ్యసిస్తున్నారు. ఇప్పటికే కొంతమంది విద్యాభ్యాసాన్ని పూర్తి చేసి ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు సంపాదించి ఐదంకెల జీతాన్నీ పొందుతున్నారు.
ఊహించని వరం.

రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడు లేని విధంగా 27 మంది ఎస్టీ విద్యార్థులు విదేశాలకు వెళ్లి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు చేస్తుండటం విశేషం. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా సుమారు 451 మంది ఎస్సీ విద్యార్థులు, ఎన్టీఆర్ విదేశీ విద్యాదరణ పథకం ద్వారా సుమారు 1605 మంది బీసీ విద్యార్థులు విదేశాలకు వెళ్లారు. ఓవర్సీస్ ఎడ్యుకేషన్ ఫర్ మైనారిటీస్ పథకంలో భాగంగా 426 మంది విద్యార్థులు, కాపు కార్పొరేషన్ ద్వారా సుమారు 1515 మంది విద్యార్థులు ప్రపంచంలోని అత్యుత్తమ విశ్వ విద్యాలయాల్లో అభ్యసిస్తున్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా సుమారు 504 మంది పేద బ్రాహ్మణులు విదేశాల్లో చదువుతూ కలను సాకారం చేసుకుంటున్నారు.

నిరుద్యోగ భృతి..యువతకు ఉపాధి..

నిరుద్యోగ యువతకు బంగారు భవిష్యత్తు అందించే లక్ష్యంతో చంద్రబాబునాయుడు ప్రవేశ పెట్టిన నిరుద్యోగ భృతి పథకం విజయవంతంగా అమలవుతోంది. నెలకు వెయ్యి నుంచి రెండువెలకు భృతిని పెంచారు. దేశంలో ఇంత వరకు ఏ రాష్ట్రం కూడా అమలు చేయలేని ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తోంది. మార్చి నెల నుంచి 4,62,814 మంది నిరుద్యోగులకు సుమారు 92కోట్ల 56 లక్షల 28వేల రూపాయలను నిరుద్యోగ భృతి కింద అందజేస్తున్నారు. యువనేస్తం ద్వారా వృత్తి, నైపుణ్య శిక్షణ ఇచ్చి ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను, వ్యాపారులనూ తయారు చేస్తున్నారు. సుమారు 2 లక్షల మంది యువత ఉద్యోగాలు పొందారు. స్కిల్ డెలవప్​మెంట్ సెంటర్ల ద్వారా పర్యాటక రంగంలో 50వేల మంది యువత శిక్షణ పూర్తి చేసుకున్నారు. కొందరు విదేశాలకు వెళ్లి కొలువులు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details