ఓట్ల లెక్కింపులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం శిక్షణ ఇస్తోంది. విజయవాడ గురునానక్ కాలనీలోని ఎన్ఏసీ కల్యాణ మండపంలో నిర్వహిస్తున్న ఈ శిక్షణ కార్యక్రమానికి సీఈవో గోపాలకృష్ణ ద్వివేది, అదనపు ప్రధాన ఎన్నికల అధికారి సుజాత శర్మ హాజరయ్యారు .
ఓట్ల లెక్కింపులో.. రిటర్నింగ్ అధికారులకు శిక్షణ - ఎన్నికల రిటర్నింగ్ అధికారులు
ఈ నెల 23న జరగనున్న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపులో రిటర్నింగ్ అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్ర స్థాయి శిక్షణ విజయవాడలో ప్రారంభమైంది.
స్పష్టమైన సూచనలు...
కౌంటింగ్‌పై ఈసీఐ డైరెక్టర్ నిఖిల్ కుమార్ శిక్షణనిస్తున్నారు. 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ నియోజకవర్గాల ఆర్వోలు, ఈవీఎంలు, వీవీప్యాట్లపై రిటర్నింగ్ అధికారులు ఈ శిక్షణలో పాల్గొన్నారు. కౌంటింగ్ కేంద్రాలలో టేబుల్స్ ఏర్పాట్లు, కౌంటింగ్ కేంద్రాలలో ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో చేపట్టే వీడియో కవరేజ్ అంశాలపై ఈసీ స్పష్టమైన సూచనలు చేసింది. వీవీ ప్యాట్ స్లిప్పులను అభ్యర్థుల వారీగా వేరు చేసి, అనంతరం ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టాలని ఈసీ స్పష్టం చేసింది.
పూర్తిగా నిర్ధారణ తర్వాతే...
ఆర్వో లు ఎన్నికల ఫలితాలు ప్రకటన చేసే ముందు పూర్తిగా నిర్ధారణ చేసుకున్న తర్వాతే ప్రకటించాలని సూచించింది. ముందుగా ప్రకటన చేసే సందర్భంలో ఎటువంటి రివార్డులు రావన్న విషయం అధికారులు గుర్తుంచుకోవాలని పేర్కొంది.