పోలీసు ఉన్నతాధికారులను బదిలీ చేయాలంటూ ఇచ్చిన ఆదేశాలపై...రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలమీద ఎన్నికల సంఘంస్పందించింది. ఏపీ పరిణామాలను సీఈసీ నిశితంగా పరిశీలిస్తోందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది చెప్పారు. ప్రభుత్వ వ్యవహారశైలిపై సీఈసీ సమాచారం సేకరిస్తోందన్నారు. జరుగుతున్న పరిణామాలను సీఈసీకి తెలియజేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ నుంచి వచ్చే వివరణలను కేంద్ర ఎన్నికల సంఘానికిపంపుతున్నామన్నారు. ఈసీ నిర్ణయాలపై అభ్యంతరం ఉంటే కోర్టును ఆశ్రయించవచ్చని స్పష్టం చేశారు.
నిఘా విభాగానికి ఎన్నికలతో సంబంధం లేదంటే ఎలా? - ఐపీఎస్ల బదిలీలు
పోలీసు ఉన్నతాధికారులను బదిలీ చేయాలంటూ ఇచ్చిన ఆదేశాలపై... రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల మీద ఎన్నికల సంఘం స్పందించింది. ఏపీ పరిణామాలను సీఈసీ నిశితంగా పరిశీలిస్తోందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది చెప్పారు.
ఎన్నికల సంఘం తరపున గురువారం హైకోర్టులో వాదనలు వినిపిస్తామన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం నేరుగా ఈ అంశాన్ని పర్యవేక్షిస్తోందని వివరించారు. పోలీసుల కదలికలు ఇంటెలిజెన్స్ తోనే ముడిపడి ఉంటాయని ద్వివేది స్పష్టం చేశారు. ఎన్నికల సిబ్బంది తరలింపు, శాంతిభద్రతలకూ ఇంటెలిజెన్స్ తోనే సంబంధం ఉంటుందని తేల్చి చెప్పారు. ఎన్నికల నిర్వహణలో మొత్తం పోలీసు వ్యవస్థ ఉంటుందన్నారు. ఇంటెలిజెన్స్ విభాగానికి ఎన్నికలతో సంబంధం లేదంటే ఎలా అని ప్రశ్నించారు. వివేకా హత్య కేసు విచారణలో నిఘా విభాగానికి బాధ్యత ఉండదా అని అడిగారు.