రేపు ఎడ్‌సెట్... ఎల్లుండి ఎంసెట్ ఫలితాలు - eamcet results
విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎంసెట్ ఫలితాలు ఈ నెల 18న విడుదల కానున్నాయి. శుక్రవారం ఎడ్‌సెట్ ఫలితాలు విడుదల చేసేందుకు యంత్రాంగం సన్నద్ధమైంది.
ఏపీ ఎంసెట్-2019 ఫలితాలను ఈ నెల 18న విడుదల చేయనున్నారు. హైదరాబాద్, ఏపీలో 115 పరీక్ష కేంద్రాల్లో ఇంజినీరింగ్, వ్యవసాయ, వైద్య విద్యలో ప్రవేశాలకు నిర్వహించిన పరీక్షలకు 2,82,901 మంది దరఖాస్తు చేశారు. వీరిలో ఇంజినీరింగ్‌కు 1,85,711 మంది, వ్యవసాయ, వైద్య విద్య పరీక్షలకు 81,916 మంది హాజరయ్యారు.
రేపు ఎడ్‌సెట్ ఫలితాలు
బీఈడీలో ప్రవేశాలకు నిర్వహించే ఎడ్‌సెట్-2019 ఫలితాలను శుక్రవారం విడుదల చేయనున్నారు. విజయవాడలో ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ విజయరాజు ప్రకటించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎడ్‌సెట్‌కు 14,019 మంది దరఖాస్తు చేయగా పరీక్షకు 11,650 మంది హాజరయ్యారు.