రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కౌన్సెలింగ్ ప్రక్రియకు తేదీలు ఖరారయ్యాయి. తెలంగాణలో ఇంటర్ పరీక్షల పునర్ మూల్యాంకణం కారణంగా ఎంసెట్ ఫలితాల విడుదలలో జాప్యం జరిగింది. ఫలితంగా కౌన్సెలింగ్ షెడ్యూల్ సిద్ధం చేయడంలోనూ ఆలస్యం జరిగింది. ఎట్టకేలకు ఎంసెట్ వేశాల కమిటీ సమావేశమై... కౌన్సెలింగ్‌కు సంబంధించిన నిర్ణయం తీసుకుంది.
అందుకే వచ్చే నెలకు
ఎంసెట్ కౌన్సెలింగ్‌కు సంబంధించి ఈ నెల 24న నోటిఫికేషన్ జారీ కానుంది. జూలై 1 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభించనున్నారు. కళాశాలలు, కోర్సుల ఎంపిక ఆప్షన్ల నమోదుకు జూలై 4 నుంచి 8వ తేదీ వరకు అవకాశం కల్పించనున్నారు. వచ్చే నెల 10న సీట్ల కేటాయింపు పూర్తి చేయనున్నారు. ఐఐటీ, నిట్‌లలో జూలై 9 నాటికి నాలుగో విడత సీట్ల కేటాయింపు పూర్తి కానుంది. ఆ తర్వాత ఏపీ ఎంసెట్ సీట్లు కేటాయిస్తే ఐఐటీ, నిట్‌లలో సీట్లు రాని వారు... రాష్ట్రంలోని కళాశాలల్లో చేరే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. దీనివల్ల కౌన్సెలింగ్‌ను వచ్చే నెలకు మార్పు చేశారు.
కళాశాలలు కాస్త ఆలస్యంగానే