ఉండవల్లి వేదికగా జరుగుతున్న రెండో రోజు కలెక్టర్ల సదస్సులో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసగించారు. తొలుత వారాంతపు సెలవు(వీక్లీ ఆఫ్ )లపై పోలీసు శాఖలోని కమీటి ఇచ్చిన నివేదికను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడిన ఆయన...ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి సాగు నియంత్రించేలా తగిన చర్యలు చేపట్టాలని పోలీసులకు సూచించారు. ప్రస్తుతం విశాఖ జిల్లాలోని 6 మండలాల్లో గంజాయి సాగవుతోందని, వాటిని ఆరికట్టేందుకు రెవెన్యూ, ఎక్సైజ్, పోలీసు శాఖలు సంయుక్తంగా పనిచేయాలని చెప్పారు. కాఫీ సాగును ఎక్కువగా ప్రోత్సహించాలని సూచించారు.
కాల్‌మనీ కేసులపై సీఎం ఆగ్రహం
కాల్‌మనీ కేసులపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని.. ఏ పార్టీవారున్నా విడిచిపెట్టొదని పోలీసు అధికారులకు స్పష్టం చేశారు. ఫిర్యాదు ఉంటే వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. విజయవాడలో ఇలాంటి ఘటనలు జరగటం దారుణమని సీఎం వ్యాఖ్యానించారు.