ఆర్టీసీ కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ సమితితో యాజమాన్యం జరిపిన చర్చలు విఫలమయ్యాయి.సమ్మె నోటీసులోని డిమాండ్లపై ఆర్టీసీ యాజమాన్యం నుంచి ఎలాంటి హామీ రాకపోవడంపై కార్మిక నాయకులు అసంతృప్తి చెందారు.ఆర్థిక ఇబ్బందుల కారణంగా డిమాండ్లను వెంటనే పరిష్కరించలేమని ఆర్టీసీ ఎండీ స్పష్టం చేశారు.ప్రభుత్వం నుంచి నిధులు రాగానే వేతన సవరణ బకాయిలు చెల్లిస్తామని చెప్పారు.అప్పటివరకు సమ్మె యోచన విరమించుకోవాలని ఈయూ సహా ఐకాస నేతలను కోరారు.
చర్చలు విఫలం.. సమ్మెపై నేడు ఐకాస నిర్ణయం
ఆర్టీసీ కార్మిక సంఘాలతో యాజమాన్యం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. తమ డిమాండ్లపై ఎలాంటి హామీ రాని కారణంగా.. సమ్మె దిశగా కార్మిక సంఘాలు ఆలోచిస్తున్నాయి. సమ్మె ప్రారంభించే తేదీని నేడు ప్రకటిస్తామని తెలిపాయి.
rtc
ఇప్పటికే తీవ్ర జాప్యం జరిగినందున ఆందోళన విరమించేది లేదని కార్మిక సంఘాల నాయకులు స్పష్టం చేశారు.వేతన సవరణ బకాయిలు సహా27డిమాండ్లపై స్పష్టమైన హామీ రాలేదన్నఐకాస నేతలు...సత్వరమే సమస్యల పరిష్కారం డిమాండ్‌తో సమ్మెకు వెళ్తామన్నారు.నేడు ఉదయం11గంటలకు సమావేశమై సమ్మె తేదీ ప్రకటిస్తామన్నారు.
Last Updated : May 22, 2019, 4:25 AM IST