వైఎస్సార్ చేయూత పథకం ద్వారా రాష్ట్రంలో 16 లక్షల 25వేల మందికి లబ్ధి చేకూర్చనున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపె విశ్వరూప్ శాసనమండలిలో తెలిపారు. ఈ అంశంపై ఎమ్మెల్సీ తిప్పేస్వామి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. 45 సంవత్సరాలు దాటిన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ మహిళలకు ప్రతి ఏటా 18వేల 750 రూపాయల చొప్పున మొత్తం 75 వేల రూపాయలు అందిస్తామని వివరించారు. సామాజిక భద్రత పెన్షన్లు 3 వేలు చేస్తామని చెప్పి 2వేల 250 మాత్రమే చేశారని ఎమ్మెల్సీ శమంతకమణి విమర్శించారు. అయితే తాము విడతల వారీగా మూడు వేలు చేస్తామని.. ఎన్నికల హామీ అలాగే ఇచ్చామని మంత్రి స్పష్టం చేశారు.
వైఎస్సార్ చేయూత పథకంతో 16 లక్షల మందికిపైగా లబ్ధి - undefined
వైఎస్సార్ చేయూత పథకం ద్వారా రాష్ట్రంలో 16 లక్షల 25వేల మందికి లబ్ధి చేకూర్చనున్నట్లు పినిపె విశ్వరూప్ అన్నారు.
![వైఎస్సార్ చేయూత పథకంతో 16 లక్షల మందికిపైగా లబ్ధి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3807107-510-3807107-1562833267141.jpg)
మంత్రి పినిపె విశ్వరూప్