ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హోదా సాధిస్తారనే ఓటేశారు... చేసి చూపించండి: చంద్రబాబు

ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో ప్రతిపక్షం, అధికార పక్షం మధ్య వాడీవేడి చర్చ జరుగింది. ప్రత్యేకహోదాపై చిత్తశుద్ధి లేకనే తీసుకురాలేక పోయారని గత ప్రభుత్వంపై సీఎం జగన్​ విమర్శలు చేశారు. స్పందించిన చంద్రబాబు... సాధిస్తారనే జనం ఓటేశారని... చేతల్లో చేసి చూపించాలని సవాల్ చేశారు.

ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో చర్చ

By

Published : Jun 18, 2019, 3:02 PM IST

Updated : Jun 18, 2019, 3:40 PM IST

ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరిగింది. సీఎం జగన్​, ప్రతిపక్ష నేత చంద్రబాబు మాటల తూటాలు పేల్చుకున్నారు. ఐదేళ్లు ప్రత్యేక హోదాని పక్కన పెట్టేయడం వల్లే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగాలు తీసిందని విమర్శించారు. దీనిపై స్పందించిన చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం 29 సార్లు దిల్లీ వెళ్లానని చంద్రబాబు గుర్తు చేశారు. నాటి ప్రధాని మన్మోహన్​సింగ్​ ఇచ్చిన హామీ గురించి ఎన్నోసార్లు గుర్తు చేసిన మోదీ ప్రభుత్వం పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. రాజకీయంగా నష్టపోయినా... రాష్ట్రాభివృద్ధి కోసం పోరాడాని చంద్రబాబు పేర్కొన్నారు. తన పట్టుదల వల్లే తెలంగాణలోని ముంపు మండలాలు ఏపీలో కలిపారని స్పష్టం చేశారు. తర్వాత మాట్లాడిన సీఎం జగన్‌... ముంపు మండలాల స్ఫూర్తితోనే ప్రత్యేక హోదా కోసం ఎందుకు పోరాడలేదని ప్రశ్నించారు. ప్రణాళిక సంఘం రద్దు కాకముందే ఒత్తిడి పెంచి ఉంటే.. హోదా అప్పుడే వచ్చి ఉండేదని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రత్యేకహోదాపై చిత్తశుద్ధి లేకనే చాలా నెలలపాటు దాని గురించే మర్చిపోయారు ఆరోపించారు.

ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో చర్చ
Last Updated : Jun 18, 2019, 3:40 PM IST

ABOUT THE AUTHOR

...view details