స్కూళ్లలో అధిక ఫీజులమీద పిటిషన్పై విచారణ వాయిదా
రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాల్లో అధిక ఫీజుల వసూలుపై దాఖలైన పిటిషన్ మీద హైకోర్టు స్పందించింది. అధిక ఫీజులు నిలువరించాలని.. తనిఖీలు నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న వాటి గుర్తింపు రద్దు చేయాలని పిటిషనర్ కోరారు. వాజ్యంలో ప్రతివాదులుగా పరిపాలనా శాఖ కార్యదర్శి, సర్వ శిక్ష అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్, రాష్ట్రంలోని వివిధ జిల్లాల విద్యాశాఖ అధికారులు, శ్రీ చైతన్య, నారాయణ, నెల్లూరు రవీంద్ర భారతి, డాక్టర్ కేకేఆర్ గౌతం పాఠశాలలకు నోటీసులు జారీ చేసింది .పూర్తి వివరాలతో పత్రాలు దాఖలు చేయాలని స్పష్టం చేస్తూ .. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
వీసీలకు హైకోర్టు నోటీసులు
ద్రావిడ, శ్రీ కృష్ణదేవరాయ వర్సిటీల ఉప కులపతులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. విశ్వవిద్యాలయాలకు వీసీల ఎంపిక కోసం ఏర్పాటుచేసిన అన్వేషణ కమిటీల్లో... ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి గత సర్కారు స్థానం కల్పించడాన్ని సవాలు చేస్తూ పిటిషన్ దాఖలైంది. విచారించిన ధర్మాసనం విసీలకు నోటీసులు జారీ చేస్తూ తనను రెండు వారాలకు వాయిదా వేసింది.
భారతి పత్తి సంస్థ కొనుగోళ్లపై...
భారత పత్తి సంస్థ పత్తి కొనుగోళ్లలో 2014-15 సంవత్సరంలో అక్రమాలు జరిగాయంటూ.. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన కొందరు హైకోర్టును ఆశ్రయించారు. రైతులకు కనీస మద్దతు ధర కల్పిస్తూ పత్తి కొనుగోలు చేయాలన్న నిబంధనలు పక్కన పెట్టి ప్రైవేటు వ్యక్తుల తో కలిసి వివిధ శాఖల అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని సదరు వ్యక్తులు ఆరోపించారు. 650 కోట్ల రూపాయల భారీ కుంభకోణం చోటు చేసుకుందన్నారు. పిటిషనర్ వాదనలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం మిగిలిన 36 పత్తి కొనుగోలు కేంద్రాల్లో రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేయొచ్చు కదా అని హోం శాఖ జీపీ ని ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేసే విషయంలో వివరాలు సమర్పించాలని హోంశాఖ తరఫు ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది.
కరకట్ట సమీపంలో భవనం కూల్చివేతపై...
కృష్ణానది కరకట్ట సమీపంలోని భవనం కూల్చివేయాలంటూ.. ఇటీవల సీఆర్డీఏ ఆదేశాలిచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణం ఉందని తెలిపింది. భవన యజమాని కోర్టును ఆశ్రయించగా.. సీఆర్డీఏ ఉత్తర్వులు నిలుపుదల చేస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. ఈ ఆదేశాలపై.. సీఆర్డీఏ హైకోర్టును ఆశ్రయించింది. సింగిల్ జడ్జ్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరింది. పిటిషన్ పై విచారణకు హైకోర్టు అంగీకరించింది.