ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాళేశ్వరంపై చేసిన వ్యాఖ్యలపై సమాధానమేంటి? :దేవినేని - kaleswaram

పోలవరం ప్రాజెక్టు కంటే ఎక్కువ సమయం కాళేశ్వరంలోనే సీఎం జగన్ గడిపారని తెదేపా నేత దేవినేని ఉమా విమర్శించారు. ప్రాజెక్టు వ్యతిరేకంగా జలదీక్ష చేసిన జగన్..ప్రారంభోత్సవానికి ఎలా వెళ్లారని ప్రశ్నించారు.

deveneni uma

By

Published : Jun 22, 2019, 10:24 AM IST


కాళేశ్వరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా జగన్ చేసిన జలదీక్ష వీడియోను మాజీ మంత్రి, తెదేపా నేత దేవినేని ఉమా ప్రదర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మూడు రోజుల పాటు జలదీక్ష చేసిన జగన్...నిన్న ఆ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఎలా వెళ్లారని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు పనులు అత్యంత పారదర్శకంగా చేపట్టామని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఎలాంటి విచారణ జరిపించినా అదే విషయం బయటపడుతోందని అన్నారు. అధికారులు 2020 వరకు పోలవరం పూర్తి చేస్తామంటే...సీఎం జగన్ మాత్రం 2021 వరకు పూర్తి చేస్తామని చెప్పటం విడ్డూరంగా ఉందని తెలిపారు. కాళేశ్వరం నిర్మిస్తే ఆంధ్రా-తెలంగాణ..భారత్-పాక్ లా మారతాయని జగన్ అనలేదా అని ప్రశ్నించారు. తమపై కోపంతో పోలవరం పనులను ఆపటం సరికాదని హితవు పలికారు. పోలవరం ప్రాజెక్టు కంటే ఎక్కువ సమయం కాళేశ్వరంలోనే జగన్ గడిపారని వాగ్బాణాలు విసిరారు.

జలదీక్షలో చేసిన వ్యాఖ్యలపై సమాధానం చెప్పాలి:దేవినేని

ABOUT THE AUTHOR

...view details