ఉపసభాపతిగా కోన రఘుపతి ఏకగ్రీవ ఎన్నిక - deputy speker kona ragupathi unanamously elected
శాసనసభ ఉపసభాపతిగా కోనరఘపతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఉపసభాపతిగా కోన రఘుపతి ఏకగ్రీవ ఎన్నిక
శాసనసభ ఉపసభాపతిగా కోన రఘపతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేయటంతో ఎన్నిక ఎకగ్రీవం అయ్యింది. డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికైన ఆయనను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు సభాపతి స్థానం వరకు వెంట తీసుకెళ్లారు. నవ్యాంధ్ర రెండో ఉపసభాపతిగా ఎన్నికైన కోన రఘపతికి అధికార, విపక్ష ఎమ్మెల్యేలు అభినందనలు తెలిపారు. కోన రఘుపతి తండ్రి కోన ప్రభాకర్‌రావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు స్పీకర్‌గా సేవలు అందించారు.