అమరావతిలోని సచివాలయంలో గిరిజన సంక్షేమ శాఖపై మంత్రి పుష్పశ్రీవాణి సమీక్ష నిర్వహించారు. ట్రైకార్ రుణాల మంజూరులో అవినీతిని గుర్తించిన మంత్రి పుష్పశ్రీవాణి... కార్ల కొనుగోలు రుణాల మంజూరులో జరిగిన అవినీతిపై విచారణకు ఆదేశించారు. గిరిజనులకు లబ్ది చేకూరకపోతే కఠిన చర్యలు తీసుకోవాలన్న మంత్రి... జీసీసీ భవనాన్ని రూ.5 కోట్లతో నిర్మించాలని ఆదేశాలు జారీ చేశారు. 31 గురుకులాల నిర్మాణానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ట్రైకార్ మంజూరులో అవినీతిపై విచారణకు ఆదేశం - Deputy cm Pushpa srivani
రాష్ట్రంలోని మినీ గురుకులాల విద్యార్థులకు హాస్టల్ వసతి పూర్తిగా కల్పించాలని ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి అధికారులను ఆదేశించారు. గిరిజన సంక్షేమ శాఖపై సమీక్ష నిర్వహించారు.
![ట్రైకార్ మంజూరులో అవినీతిపై విచారణకు ఆదేశం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3625202-821-3625202-1561119168684.jpg)
మంత్రి పుష్పశ్రీవాణి సమీక్ష