ఫొని తుఫాన్ ప్రభావిత రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి ప్రదీప్ కుమార్ సిన్హా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఒడిశాకు ఏపీ, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు అండగా నిలవాలని సూచించారు. తాగునీరు పంపిణీ, విద్యుత్, టెలికాం రంగాల పునరుద్ధరణలో సహాయసహకారాలు అందించాలన్నారు. సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం స్పందిస్తూ.. ఒడిశాకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అన్ని విధాలా అండగా ఉంటారని స్పష్టం చేశారు. కూలిపోయన చెట్ల తొలగింపునకు 200 పవర్ షా(కటింగ్ రంపాలు) అందించామన్నారు. 12 లక్షల వాటర్ ప్యాకెట్లతో పాటు 20 వాటర్ ట్యాంకర్లతో తాగునీరు పంపిణీ చేశామని తెలిపారు.
ఒడిశాకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అండగా ఉంటారు:సీఎస్ - కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి ప్రదీప్ కుమార్ సిన్హా
తుపాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఒడిశా రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున శాయశక్తులా అండగా ఉంటామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఫొని తుఫాన్ ప్రభావిత రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి ప్రదీప్ కుమార్ సిన్హా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
విద్యుత్ సేవల పునరుద్ధరణకు 1100 మంది విద్యుత్ సిబ్బంది సిద్ధంగా ఉన్నారని, వారిని ఒడిశాకు పంపేలా చర్యలు తీసుకుంటామని సీఎస్ తెలిపారు. ఇనుప విద్యుత్ స్తంభాలు, 5 వేల లీటర్ల కెపాసిటీ కలిగిన 500 సింటెక్స్ వాటర్ ట్యాంకులు అందజేయాలని ఒడిశా సీఎస్ కోరారు. వాటర్ ట్యాంకులు పంపిణీకి చర్యలు తీసుకుంటామని, ఇనుప విద్యుత్ స్తంభాలు తమ దగ్గర లేవని..ఏపీలో సిమెంట్ తో తయారు చేసిన విద్యుత్ స్తంభాలే వాడుతున్నామని సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలిపారు.
ఇవీ చదవండి...రేపు జరిగే రీపోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి: ద్వివేది