ఉండవల్లిలోని ప్రజావేదిక నిర్మాణంపై ముఖ్యమంత్రికి సీఆర్డీఏ నివేదిక అందజేసింది. ప్రజావేదిక నిర్మాణానికైన ఖర్చు,టెండర్ల కేటాయింపు తదితర అంశాలపై ఈ నివేదికను రూపొందించింది. దీని నిర్మాణం కోసం జలవనరుల శాఖ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదని సీఆర్డీఏ స్పష్టం చేసింది. నదీ గరిష్ఠ వరదనీటి మట్టం కన్నా ఈ ప్రాంతం దిగువున ఉన్నందున ప్రజావేదిక నిర్మాణానికి కృష్ణా నదీ సెంట్రల్ డివిజన్ చీఫ్ ఇంజనీరు నిరాకరించారని తెలిపింది. 4 కోట్ల రూపాయలకు టెండర్లు ఖరారు కాగా....నిర్మాణం పూర్తయ్యేసరికి 7 కోట్ల 59 లక్షల రూపాయల ఖర్చయ్యిందని నివేదికలో పొందుపరిచింది. మొత్తం 15 అంశాలతో కూడిన ఈ నివేదికను సీఆర్డీఏ ప్రభుత్వానికి సమర్పించింది.
ప్రజావేదిక ఫైలు.... సీఎం జగన్ టేబుల్ పైనా - CRDA submit report Praja Vedika to Government
ఉండవల్లిలో చంద్రబాబు నివాసానికి సమీపంలో నిర్మించిన ప్రజావేదికపై రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాథికార సంస్థ ముఖ్యమంత్రి జగన్‌కి నివేదికను అందజేసింది. ప్రజావేదిక నిర్మాణానికి ఎంత ఖర్చయిం. ఎవరికి టెండర్లు కేటాయించారు తదితర అంశాలపై సీఆర్డీఏ దీనిని రూపొదించింది.
నిబంధనలకు విరుద్ధంగా ప్రజావేదిక నిర్మాణం