సీఎంతో సీపీఎం నేతల భేటీ.. - సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు
ప్రత్యేక హోదాతో పాటు ప్రజా సమస్యలపై పోరాడిన తమ కార్యకర్తలపై కేసులు ఎత్తివేయాలని సీఎం జగన్ కు సీపీఎం నేతలు కోరారు. తాము చెప్పిన అంశాలపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు.
cpim-leaders-meeting-with-cm-cases-to-be-lifted-1
తాడేపల్లిలోని నివాసంలో సీఎం జగన్‌తో సీపీఎం నేతలు భేటీ అయ్యారు. ప్రత్యేక హోదాతో పాటు ప్రజా సమస్యలపై పోరాడిన తమ కార్యకర్తలపై కేసులు ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. అసంఘటిత కార్మికులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని ముఖ్యమంత్రిని కోరినట్టు నేతలు తెలిపారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, ముఖ్య నాయకులు గఫుర్, వైవీ ఉన్నారు.