ఓట్ల లెక్కింపులో.. అగ్రనాయకులకు షాక్!
సార్వత్రిక ఎన్నికల ఫలితాల సరళి.. అగ్ర నాయకులకు షాక్ ఇస్తోంది. విజయం ఖాయమనుకున్న వారితో సహా.. చాలా మందికి ముచ్చెమటలు పడుతున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలు స్పష్టతనిస్తున్నాయి. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న వైకాపా.. అధికారం దిశగా దూసుకుపోతున్నట్టు ఫలితాల సరళి స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో.. ఎన్నికల్లో పోటీలో ఉన్న ప్రముఖుల ఫలితాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. కుప్పం నుంచి బరిలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. మొదటి రెండు రౌండ్లలో అనూహ్యంగా వెనకపడ్డారు. మూడో రౌండ్ కు వచ్చేసరికి దాదాపు 1500 ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు. మంత్రులు... అచ్చెన్నాయుడు, కిడారి శ్రావణ్, కళా వెంకట్రావు, నారాయణ,అఖిలప్రియ, లోకేశ్, పితాని,నక్కా ఆనందబాబు, గంటా,అయ్యన్నపాత్రుడు, చినరాజప్ప,కొల్లు రవీంద్ర, ఆదినారాయణరెడ్డివెనుకంజలో ఉన్నారు.మరోవైపు.. వైకాపా నుంచి.. చీపురుపల్లి బరిలో ఉన్న మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, గుంటూరు జిల్లా సత్తెనపల్లి నుంచి అంబటి రాంబాబు.. జోరు మీదున్నారు. వైకాపా అధినేత జగన్.. కడప జిల్లా పులివెందుల నుంచి భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతున్నారు.