ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రజా వేదికలో కలెక్టర్ల సదస్సు... హాజరుకానున్న సీఎం - collector's review

ప్రజా వేదికలో రేపు ఉదయం 10 గంటలకు కలెక్టర్ల సదస్సు ప్రారంభం కానుంది. ఈ సదస్సులో 10.30 గంటల నుంచి 11.15 వరకూ సీఎం జగన్‌ మాట్లాడనున్నారు.

ప్రజావేదికలో కలెక్టర్ల సదస్సు... హాజరుకానున్న సీఎం

By

Published : Jun 23, 2019, 9:59 PM IST

ప్రజావేదికలో కలెక్టర్ల సదస్సు... హాజరుకానున్న సీఎం

రాజధాని అమరావతిలోని ప్రజావేదికలో రేపు,ఎల్లుండి కలెక్టర్ల సదస్సు నిర్వహించనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ప్రారంభోపన్యాసంతో కలెక్టర్ల సదస్సు ప్రారంభం కానుంది. అనంతరం 10.30 గంటల నుంచి 11.15 వరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సదస్సులో ప్రసంగిస్తారు. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి... పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ సదస్సులో మాట్లాడనున్నారు.

పారదర్శక పరిపాలన, గ్రామ సచివాలయాలు, వాలంటీర్లపై చర్చించనున్నారు. ఆరోగ్యశ్రీ, 104, 108 వాహనాలపైనా చర్చలు జరిగే అవకాశం ఉంది. పౌరసరఫరాలశాఖ, ఇంటికి రేషన్ సరకులు, ఇతర అంశాలూ ఈ సదస్సులో చర్చకొచ్చే అవకాశం ఉంది. పాఠశాలల్లో విద్యార్థుల చేరిక, పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తుల పంపిణీ, తాగునీరు, వ్యవసాయం, పశుపోషణ, విద్యుత్ సరఫరాపై చర్చించనున్నారు.

మధ్యాహ్నం 1.45 గంటల నుంచి 2.30 గంటల వరకు భోజన విరామం ఉంటుంది. అనంతరం ఇళ్లు, ఇళ్ల స్థలాలు, ఇతర అంశాలపై చర్చించనున్నారు. ఈ సదస్సులో మంగళవారం ఉదయం 10 గంటలకు శాంతిభద్రతలపై చర్చించే అవకాశం ఉంది. అదేరోజూ ఉదయం 11.30 నుంచి 1.30 వరకు పోలీసుశాఖపై సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షలో కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. మంగళవారం ఉదయం ఎస్పీలు, అధికారులతో సీఎం ప్రత్యేకంగా భేటీ కానున్నారు.

ఇదీ చదవండీ...

జిల్లాలవారీగా.. వాలంటీర్ల నోటిఫికేషన్లు వచ్చేశాయ్

ABOUT THE AUTHOR

...view details