కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన ముఖ్యమంత్రి - సీఎంచంద్రబాబు
గుంటూరు జిల్లా ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారితో పాటు మంత్రి లోకేశ్, ఆయన సతీమణి బ్రాహ్మణి ఓటు వేశారు.

babu
ఓటేసిన ముఖ్యమంత్రి కుటుంబం
అమరావతిలోని ఉండవల్లిలో... సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. చంద్రబాబు, సతీమణి భువనేశ్వరితో పాటు కుమారుడు లోకేశ్, బ్రాహ్మణి కూడా ఓటు వేశారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇది అందరి బాధ్యత అని గుర్తు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు చాలా కీలకమైనవని...ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని మంత్రి లోకేశ్ ప్రజలను కోరారు.
Last Updated : Apr 11, 2019, 5:47 PM IST