'వచ్చే ఎన్నికలు ఏకపక్షమే' - అన్నదాత సుఖీభవ
పదవులపై ఆశలు ఉన్న ఒకరిద్దరికి తప్పుడు సర్వేలు చూపి మభ్యపెడుతున్నారని ముఖ్యమంత్రి తెలిపారు. పార్టీని వీడి పోయేవారి గురించి పట్టించుకోవద్దని... వచ్చే ఎన్నికలు ఏకపక్షమేనని నేతలతో చంద్రబాబు చెప్పారు.
సీఎం చంద్రబాబు టెలీకాన్పరెన్స్
హైదరాబాద్లో ఆస్తులు ఉన్న నేతలు వైకాపాలో చేరాలని బెదిరిస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. పదవులపై ఆశలు ఉన్న ఒకరిద్దరికి తప్పుడు సర్వేలు చూపి మభ్యపెడుతున్నారని...అలా పోయేవారి గురించి పట్టించుకోవద్దని... వచ్చే ఎన్నికలు ఏకపక్షమేనని నేతలతో సీఎం చెప్పారు. పింఛన్ల పెంపు, పసుపు కుంకుమ, అన్నదాత- సుఖీభవ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. ఇవాళ, రేపు, ఎల్లుండి అన్నదాత సుఖీభవ వేడుకలు నిర్వహించాలని నేతలను ఆదేశించారు.
Last Updated : Feb 19, 2019, 10:25 AM IST