ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హోదాపై మోదీ ప్రభుత్వానిదే యూ టర్న్: సీఎం రమేష్ - అరుణ్ జైట్లీ

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యలపై రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ స్పందించారు. హోదా విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు  తీసుకున్నది రైట్ టర్న్ అన్నారు. కేంద్రమే యూటర్న్ తీసుకుందని ఆరోపించారు.

సీఎం రమేష్

By

Published : Apr 2, 2019, 9:36 PM IST

సీఎం రమేష్
ముఖ్యమంత్రి చంద్రబాబుపై... కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేసినవ్యాఖ్యల మీద రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ స్పందించారు. ప్రత్యేక ప్యాకేజీకి ఎలాంటి పరిస్థితుల్లో ఒప్పుకున్నామో అరుణ్ జైట్లీ కి తెలియదా అని ప్రశ్నించారు. కడప జిల్లా ప్రొద్దుటూరులోని పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన జైట్లీ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ప్రత్యేక హోదాకు సమానంగా ప్యాకేజీ ఇస్తామని చెప్పి ఇంతవరకూ ప్యాకేజీ కూడా ఇవ్వలేదని ఆరోపించారు. విభజన చట్టంలో ఉన్న ఏ అంశాలను మోదీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమలు చేయలేదన్నారు.హోదా విషయంలో చంద్రబాబు తీసుకున్నది రైట్ టర్న్ అని.. భాజపా ప్రభుత్వమే యూటర్న్ తీసుకుందని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి

ABOUT THE AUTHOR

...view details