ఈ ఏడాది మహానాడు వాయిదా.. - cm_meeting_with_party_leaders
ఎన్టీఆర్ జయంతి సందర్బంగా తెదేపా ప్రతి ఏడాది ఘనంగా నిర్వహించుకునే మహానాడు వాయిదా పడింది. మహానాడు స్థానంలో ఎన్టీఆర్ జయంతిని గ్రామగ్రామాన ఘనంగా నిర్వహించాలని తెదేపా నిర్ణయించింది.
ఈ ఎడాది మహానాడు వాయిదా వేయాలని తెదేపా నిర్ణయించింది. కేబినేట్ భేటీకి ముందు నేతలతో సమావేశమైన చంద్రబాబు మహానాడు నిర్వహణపై చర్చించారు. పలువురు నేతలు ఎన్నికల ఫలితాలకు, మహానాడు తేదీలకు సమయం సరిపోదని అభిప్రాయపడ్డారు. దీంతో మహానాడు వాయిదా వేయాలని నిర్ణయించారు. అయితే మహానాడు స్థానంలో ఎన్టీఆర్ జయంతిని ఘనంగా నిర్వహించాలని నేతలందరూ సూచించారు. గతంలో వివిధ సందర్భాల్లో మహానాడు నిర్వహించలేదని... 1985, 1991, 1996లో అధికారంలో ఉన్నా మహానాడు నిర్వహించలేదని నేతలు తెలిపారు. ఎన్టీఆర్ జయంతి రోజున గ్రామగ్రామాన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు.