ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పలు జిల్లాల తెదేపా నేతలతో చంద్రబాబు భేటీ' - డాక్టరు బి. యామినీబాలలు

రాష్ట్రంలోని పలు జిల్లాల తెలుగుదేశం నాయకులతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. పార్టీకి దీర్ఘకాలికంగా సేవలు అందిస్తున్న కొంతమంది సీనియర్లు, కొన్ని నియోజకవర్గాల్లో వ్యక్తిగతంగా నామినేషన్లు వేసిన అభ్యర్థులు చంద్రబాబుతో సమావేశమయ్యారు.

'పలు జిల్లాల తెదేపా నేతలతో చంద్రబాబు భేటీ'

By

Published : Mar 25, 2019, 6:10 AM IST

ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలోని పలు జిల్లాల తెలుగుదేశం నాయకులతో భేటీ అయ్యారు. పార్టీకి దీర్ఘకాలికంగా సేవలు అందిస్తున్న కొంతమంది సీనియర్లు, కొన్ని నియోజకవర్గాల్లో వ్యక్తిగతంగా నామినేషన్లు వేసిన అభ్యర్థులు చంద్రబాబుతో సమావేశమయ్యారు. మరో పక్క తటస్థులు క్రమంగా తెదేపా పట్ల ఆకర్షుతులవుతూ...ముఖ్యమంత్రి సమక్షంలోనే తెదేపాలో చేరుతున్నారు.

ఎన్నికల ప్రచార పర్యటనలలో తీరికలేకపోయినా.. ఆయా నాయకులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన నాయకులతో చర్చించి పలు సూచనలు చేశారు. అనంతపురం జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి పి. సుబ్రహ్మణ్యం, కర్నూలు జిల్లా నంద్యాల నుంచి కాపు కార్పొరేషన్మాజీ డైరెక్టరు వెదుర్ల రామచంద్రరావు ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. నంద్యాల తెలుగుదేశం పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని చంద్రబాబు రామచంద్రరావును ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా రాజోలు తెదేపా నాయకులు డాక్టరు గేదెల వరలక్ష్మి, బత్తుల రాములు సీఎంని కలిసి చర్చించారు.

విజయనగరం జిల్లా చీపురుపల్లిలో వ్యక్తిగతంగా పోటీలో నిలిచిన కే. త్రిమూర్తులు రాజు చంద్రబాబుని కలిశారు. శాసనమండలి సభ్యురాలు పమిడి శమంతకమణి, తాజా మాజీ శాసనసభ్యురాలు డాక్టరు బి. యామినీబాలలు ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. నరసరావుపేట తెదేపా ఎంపీ, ప్రస్తుత ఎంపీ అభ్యర్థి అయిన రాయపాటి సాంబశివరావుతోపాటు గుంటూరు జిల్లా కోఆపరేటీవ్ సెంట్రల్ బ్యాంక్ మాజీ ఛైర్మన్ నల్లపాటి చంద్రశేఖరరావు, ఆయన కుటుంబసభ్యులు కలిసి వచ్చారు.

ఇవీ చూడండి

''ఆర్ధిక ఉగ్రవాదిలా తెలంగాణ ప్రభుత్వ తీరు''

ABOUT THE AUTHOR

...view details