నవ్వులు పూయించిన చంద్రబాబు ఛలోక్తులు - jokes
భాజపాపై ఛలోక్తులతో శాసనసభలో నవ్వులు పూయించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
శాసనసభలో నవ్వులు చిందిస్తున్న ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసనసభలో నవ్వులు పూయించారు. "అసెంబ్లీ సమావేశాలకు నేడే చివరి రోజు. రేపటి నుంచి ఎన్నికల హడావుడిలో ఉంటాం. విజన్ 2029ని ప్రతి నాయకుడు పాటిస్తే భాజపా కాదు కదా మరే పార్టీ వచ్చిన తెదేపా విజయాన్ని ఆపలేదు. ఒకవేళ అడ్డువస్తే కొట్టుకుపోతారు" అని భాజపా నేతలను ఉద్ధేశించి ఛలోక్తి విసిరారు. కమల పార్టీ నాయకులైన విఘ్ణకుమార్ రాజు, మాణిక్యాలరావు కూడా చంద్రబాబు మాటలకు నవ్వుతూ కనిపించారు.