ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాఫర్ డ్యామ్ పనులపై జగన్ అసంతృప్తి

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఆయనకు ప్రాజెక్టు వద్ద మంత్రులు అనిల్ యాదవ్, ఆళ్ల నాని, తానేటి వనిత స్వాగతం పలికారు. తొలుత ఏరియల్ సర్వే ద్వారా ప్రాజెక్టును సీఎం జగన్ పరిశీలించారు. అనంతరం వ్యూ పాయింట్ నుంచి ప్రాజెక్టు పనులను పరిశీలించారు.

cm_jagna_visit_polavaram_today

By

Published : Jun 20, 2019, 7:54 AM IST

Updated : Jun 20, 2019, 4:20 PM IST

పోలవరం పనులు పరిశీలించిన జగన్

కాఫర్ డ్యామ్ పనులు అసంపూర్తిగా ఉండడంపై జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు.ప్రాజెక్టు నిర్మాణం,కాఫర్ డ్యామ్ రక్షణ ఏర్పాట్లను సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు.వరద వచ్చే నాటికి పనులు ఎందుకు పూర్తి చెయ్యలేదని, ఒకవేళ ఎక్కువ వరద వస్తే పరిస్థితి ఏంటని అధికారులను ప్రశ్నించారు. కాఫర్​ డ్యామ్​లతో పాటు, నీరు మళ్లితే స్పిల్ వే కట్టడం, ఎటువంటి రక్షణ చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నిచారు. స్పిల్ వే, పైలట్, స్పిల్ ఛానెల్​లో ఇంకా ఎంత కాంక్రీట్​ పని మిగిలి ఉందని ఆరా తీశారు. వరద నీటి కారణంగా ఇప్పటి వరకు చేపట్టిన నిర్మాణాలు దెబ్బ తినకుండా రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. కాఫర్ డ్యామ్ నదిలో వచ్చే వరదను తట్టుకోగలదా అని జలవనరుల శాఖ అధికారులను అడిగారు.

అధికారులతో సమీక్ష అనంతరం నిర్వాసితులతో సీఎం భేటీ అయ్యారు. ఈ సందర్బంగా నిర్వాసితులు మెరుగైన పరిహారం ఇవ్వాలని ముఖ్యమంత్రికి వినతిపత్రం అందజేశారు.

Last Updated : Jun 20, 2019, 4:20 PM IST

ABOUT THE AUTHOR

...view details