ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సెప్టెంబరు 5 నుంచి నూతన ఇసుక విధానం : సీఎం జగన్ - new sand policy

రాష్ట్రంలో అమలు చేయబోయే నూతన ఇసుక విధానంపై సీఎం సమీక్ష నిర్వహించారు. నూతన విధానాన్ని సెప్టెంబరు నుంచి అమల్లోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఇసుక రీచ్​ల వద్ద స్టాక్ యార్డులు, సీసీ కెమెరాలతో పర్యవేక్షణ, ఇసుక తరలింపు వాహనాలకు జీపీఎస్ ట్యాగింగ్ వంటి అంశాలను నూతన విధానంలో అమలు చేయాలని జగన్ సూచించారు. ఏపీఎండీసీ ద్వారా ఇసుక విక్రయం చేపట్టాలని జగన్ నిర్ణయించారు.

నూతన ఇసుక విధానంపై సీఎం జగన్ సమీక్ష

By

Published : Jul 4, 2019, 4:54 PM IST

Updated : Jul 4, 2019, 9:51 PM IST



తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఇసుక విధానంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. నూతన ఇసుక విధానంపై అధికారులకు సీఎం జగన్ పలు సూచనలు చేశారు. పారదర్శకంగా నూతన ఇసుక విధానాన్ని రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఏపీఎండీసీ ద్వారా ఇసుకను విక్రయించాలని సీఎం నిర్ణయించారు. ప్రస్తుతం లభిస్తున్న ధర కన్నా తక్కువ ధరకే ఇసుకను అందించాలన్న సీఎం... పర్యావరణాన్ని పరిరక్షించేలా పారదర్శక విధానం రూపొందించాలని కోరారు.

నూతన ఇసుక విధానం...

సెప్టెంబరు 5 నుంచి నూతన ఇసుక విధానం అమలు చేయాలని సీఎం నిర్ణయించారు. ఇసుకపై వచ్చే ఆదాయం పక్కదారి పట్టకుండా పటిష్ట వ్యవస్థను రూపొందించాలని అధికారులకు సూచించారు. ఇసుకపై వచ్చే ఆదాయం ప్రభుత్వ ఖజానాకే చేరేలా నూతన విధానం ఉండాలన్న జగన్... ఏపీఎండీసీ ద్వారా ఇసుకను విక్రయించాలని నిర్ణయించారు. ప్రస్తుతం లభిస్తున్న ధరకన్నా తక్కువ ధరకే ఇసుకను అందించాలని సీఎం ఆదేశించారు.

ఇసుక తరలింపు వాహనాలకు జీపీఎస్

ఇసుక రీచ్‌ల వద్ద స్టాక్‌ యార్డులు, నగరాలు, పట్టణాల్లో అదనపు స్టాక్‌ యార్డులు ఏర్పాటుచేయాలన్న జగన్...ఇసుక రీచ్‌ నుంచి స్టాక్‌ యార్డుకు తరలింపునకు ఒక రశీదు..స్టాక్‌యార్డునుంచి వినియోగదారుడుకు చేరేంతవరకూ మరొక రశీదు ఇవ్వాలన్నారు. రీచ్‌ల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు, వేబ్రిడ్జిల ద్వారా లెక్కింపు ఉండేలా చూడాలన్నారు. ఇసుక తవ్వకాలు, తరలింపులో వాడే వాహనాలకు జీపీఎస్‌ తప్పనిసరి అన్నారు. మాఫియాకు, అక్రమాలకు, అవకతవకలకు, కల్తీలకు దారితీయకుండా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు.

ఇసుక అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణాదారులపై కఠిన చర్యల తీసుకోవాలన్న జగన్... చట్టపరంగా కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. రెండు నెలల కాలంలో ఇసుక రవాణా వాహనాల గుర్తింపు, జీపీఎస్‌ అమరిక, ఇతర సాంకేతిక సన్నాహాలు, వేబ్రిడ్జి, సీసీ కెమెరాల ఏర్పాటు, స్టాక్‌యార్డుల ఏర్పాటు పూర్తి చేయాలని సూచించారు.

ఇసుక వినియోగదారులకు యాప్

ఇసుక వినియోగదారుల కోసం ఒక యాప్, వెబ్‌ పోర్టల్‌ను ఏర్పాటు చేయాలని ఏపీఎండీసీకి జగన్ సూచించారు. కొత్త ఇసుక విధానం అమల్లోకి వచ్చేంత వరకూ కలెక్టర్ల పర్యవేక్షణలో తవ్వకాలు ఉంటాయన్నారు. రెండునెలల్లోగా అదనపు రీచ్‌లను గుర్తింపు, డిమాండ్‌కు తగినట్టుగా ఇసుకను అంచేందుకు ఎన్‌ఎండీసీ సిద్ధమవ్వాలని ఆదేశించారు. ప్రభుత్వానికి, వినియోగదారుడికి పరస్పరం మేలు జరిగేలా ధరను నిర్ణయించాలని గనులశాఖకు సీఎం సూచించారు. కోరిన వెంటనే ఇసుకను అందుబాటులో ఉంచేలా రవాణా వ్యవస్థ చర్యలు చేపట్టాలని చెప్పారు.

సెప్టెంబరు 5 నుంచి నూతన ఇసుక విధానం : సీఎం జగన్

ఇదీ చదవండి :ఆర్థికశాఖపై సీఎం జగన్ సమీక్షా సమావేశం

Last Updated : Jul 4, 2019, 9:51 PM IST

ABOUT THE AUTHOR

...view details