మంత్రివర్గంలో పదవులు ఆశించి నిరాశకు గురైన వారిని సీఎం జగన్ బుజ్జగిస్తున్నారు. ఎమ్మెల్యేలు రోజా, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ప్రతాప్‌కుమార్‌రెడ్డితో జగన్ మాట్లాడారు. అసంతృప్త నేతలను విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి... జగన్ వద్దకు పిలిపించి మాట్లాడించారు. ఎమ్మెల్యేలకు నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఇస్తామని వైకాపా అధ్యక్షుడు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో మంత్రి పదవులకు సైతం పరిశీలిస్తామని తెలిపినట్లు సమాచారం. రేపట్నుంచి శాసనసభ సమావేశాల నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలంతా తప్పకుండా హాజరుకావాలని జగన్ ఆదేశించారు.
అసంతృప్త నేతలకు జగన్ బుజ్జగింపులు
మంత్రి పదవి ఆశించి భంగపాటుకు గురైన నేతలను జగన్ బుజ్జగిస్తున్నారు. నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత కల్పిస్తామని నేతలకు హామీ ఇస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలకు పార్టీ ఎమ్మెల్యేలందరూ హాజరుకావాలని జగన్ ఆదేశించారు.
'అసంతృప్త నేతల బుజ్జగింపు పనిలో జగన్'