ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"సున్నా వడ్డీ" ఇవ్వలేదని తేలితే.. చంద్రబాబు రాజీనామా చేస్తారా..? జగన్​ - రామానాయుడు

ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్‌ సమావేశాల తొలిరోజే సభలో గందరగోళం నెలకొంది. రాష్ట్రంలో కరవు, నీటి ఎద్దడి సమస్యపై సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రసంగం తర్వాత... తెదేపా శాసన సభాపక్ష ఉప నేత నిమ్మల రామానాయుడు మాట్లాడుతున్న క్రమంలో దూమారం చెలరేగింది.

CM_JAGAN_FIRES_ON_CHANDRABABU_IN_ASSEMBLY

By

Published : Jul 11, 2019, 6:13 PM IST

Updated : Jul 11, 2019, 7:42 PM IST


జగన్ ప్రసంగం తర్వాత నిమ్మల రామానాయుడు సున్నా వడ్డీ పథకం కొత్తదేమీ కాదని వ్యాఖ్యానించగా... సభలో గందరగోళం నెలకొంది. ఈ పథకం గతంలో కిరణ్‌కుమార్‌ రెడ్డి ప్రవేశపెట్టారని.. తమ ప్రభుత్వం సైతం దాన్ని కొనసాగించిందని తెలిపారు. దీనిపై జోక్యం చేసుకున్న సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి తెదేపా విమర్శలు తప్పని నిరూపిస్తే చంద్రబాబు రాజీనామా చేస్తారా? అంటూ సవాల్ విసిరారు. 2014 నుంచి 2019 వరకు రాష్ట్ర రైతులకు తెదేపా ప్రభుత్వం సున్నా వడ్డీ పథకంపై రూపాయి కూడా ఇవ్వలేదని.. అవసరమైతే రికార్డులు తీసుకొస్తానని జగన్ అన్నారు. సున్నా వడ్డీకింద రైతులకు ఎంత డబ్బు ఇచ్చారో చంద్రబాబు చెప్పాలన్నారు. తప్పని తేలితే చంద్రబాబు తన పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళతారా అంటూ ప్రశ్నించారు. దీంతో సభలో వాగ్వాదం చోటుచేసుకుంది.

తప్పని తేలితే..చంద్రబాబు రాజీనామా చేస్తారా?:జగన్​
Last Updated : Jul 11, 2019, 7:42 PM IST

ABOUT THE AUTHOR

...view details