అంబులెన్స్ వెళ్తుంటే.. సీఎం జగన్ ఏం చేశారంటే? - అంబులెన్స్
ముఖ్యమంత్రి కాన్వాయ్ కన్నా రోగి ప్రాణాలే మిన్న అని నిరూపించారు ముఖ్యమంత్రి జగన్. అత్యవసర చికిత్స కోసం రోగిని తరలిస్తున్న అంబులెన్స్‌కు దారి ఇవ్వాలని భద్రతా సిబ్బందిని ఆదేశించారు.

ముఖ్యమంత్రి జగన్ మానవత్వాన్ని చాటుకున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తన నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి వెళ్తున్న సమయంలో... బెంజ్ సర్కిల్ రాగానే ఓ ప్రైవేట్ అంబులెన్స్ వచ్చింది. ముఖ్యమంత్రి కాన్వాయ్ అంబులెన్స్‌కు దారి ఇచ్చి ఆసుపత్రికి వెళ్లేందుకు సహకరించింది. సీఎం కాన్వాయ్ వస్తోందని బెంజ్ సర్కిల్ పోలీసు సిబ్బంది ట్రాఫిక్‌ను నిలిపివేశారు. బందరు రోడ్ నుంచి వస్తున్న అంబులెన్స్ కూడా అదే సమయంలో అక్కడికి చేరుకోగా... దాన్ని గమనించిన ముఖ్యమంత్రి జగన్.. దారి ఇవ్వాల్సిందిగా సిబ్బందిని ఆదేశించారు. దీంతో రోగిని సకాలంలో ఆసుపత్రికి తరలించగలిగారు.