ఈ నెల 12 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగనుండటంతో... శాసనసభలో ముఖ్యమంత్రి కార్యాలయాన్ని సిద్ధం చేస్తున్నారు. అసెంబ్లీ నిర్వహణ కోసం సిబ్బంది ఏర్పాట్లలో మునిగిపోయారు. ముఖ్యమంత్రికి సంబంధించిన నామఫలకాన్ని ఇప్పటికే ఆయన కార్యాలయం ముందు బిగించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షం, తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష కార్యాలయాల మార్పులపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. శాసనసభాపక్ష కార్యాలయాలు చిన్నవిగా ఉండటంతో... ఆనుకొని ఉన్న గదులు మార్చి విస్తరిస్తున్నారు. ప్రభుత్వ చీఫ్‌విప్‌గా శ్రీకాంతరెడ్డి, విప్‌లుగా కొలుసు పార్ధసారథి, కొరుముట్ల శ్రీనివాసులు, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, దాడిశెట్టి రాజా, మాడుగుల ముత్యాలనాయుడు ఛాంబర్లూ సిద్ధం చేస్తున్నారు.
శాసనసభలో ముఖ్యమంత్రి కార్యాలయం సిద్ధం - ap ministers
రాష్ట్ర శాసనసభలో ముఖ్యమంత్రి కార్యాలయాన్ని అధికారులు సిద్ధం చేస్తున్నారు. అసెంబ్లీ నిర్వహణ కోసం సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు.
శాసనసభలో ముఖ్యమంత్రి కార్యాలయం
Last Updated : Jun 9, 2019, 10:51 AM IST