కాపు రిజర్వేషన్లపై...సభలో గందరగోళం నెలకొంది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం పెరిగింది. ప్రతిపక్షనేత అడిగన ప్రశ్నకు ముఖ్యమంత్రి జగన్ సమాధానమిచ్చారు. కాపులను అడ్డగోలుగా మోసం చేశారు కాబట్టే ప్రతిపక్షంలో కూర్చోబెట్టారని తెదేపాను ఉద్దేశించి ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించారు. కాపులకు బడ్జెట్‌లో కేటాయింపులు చేసి...ఖర్చు చేయకుండా వదిలేశారని మండిపడ్డారు.
కాపులకు రిజర్వేషన్ ఇవ్వడం సాధ్యం కాదు: సీఎం - కాపు రిజర్వేషన్లు
కాపు రిజర్వేషన్‌పై అసెంబ్లీలో చర్చ రసవత్తరంగా సాగింది. అధికార, ప్రతిపక్షాల మధ్య..వాదోపవాదాలు బలంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు అడిగిన ప్రశ్నలకు..సీఎం సమాధానమిచ్చారు.
'కాపులకు 5 శాతం రిజర్వేషన్లపై మా వైఖరి అడిగారు. ఈ ప్రశ్న వేసేముందు కనీసం చంద్రబాబు ఆలోచించారా?. కేంద్రం 10 శాతం రిజర్వేషన్లు ఇస్తే మనం ఇష్టం వచ్చినట్లు చేయడం కాదు?. చంద్రబాబుకు మోసాలు చేయడం కొత్తకాదు... అదే పద్ధతిలో కాపులను మోసం చేశారు. మంజునాథ కమిషన్ పేరుతోనూ మోసం చేశారు. ఇప్పటికైనా వైఖరి మార్చుకోవాలని చంద్రబాబును కోరుతున్నా. మోసం చేయడం, అబద్ధాలు చెప్పడం నాకు అలవాటు లేదు. నేను చేయగలుగుతానని అనిపిస్తేనే చెబుతా... చేస్తానని చెప్పి చేయకుండా మోసం చేయడం నా నైజం కాదు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏ రాష్ట్రంలోనూ రిజర్వేషన్లు 50 శాతం మించకూడదు. కాపులకు ఏటా 2 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో 10 వేల కోట్లు ఇస్తామని చెప్పాం. ప్రస్తుతం బడ్జెట్‌లో కాపులకు రూ.2 వేల కోట్లు కేటాయించాం'. అని ముఖ్యమంత్రి జగన్ సమాధానమిచ్చారు.
ఇదీ చదవండి:'అటువైపు చూస్తే..అందంగా కనబడతా!'