అలా ముందుకెళ్దాం! - tdp
నేతల వలసలు, పార్టీలో చేరికలపై సీఎం చంద్రబాబు ఎన్నికల కమిటీతో చర్చించారు. హైదరాబాద్ కేంద్రంగా జరుగుతోన్న ఏపీ రాజకీయ పరిణామాలపై దృష్టి పెట్టాలని నిర్ణయించారు.
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యాచరణపై ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు. అమరావతిలో ఎన్నికల వ్యూహ కమిటీతో తెదేపా అధినేత భేటీ అయ్యారు. సమావేశానికి మంత్రులు యనమల, దేవినేని నెహ్రూ, పితాని సత్యనారాయణ, నక్క ఆనందబాబు... ఎంపీ గల్లా జయదేవ్, ధూళిపాళ్ల నరేంద్ర హాజరయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులతో పాటు.. నేతల ఫిరాయింపుల వ్యవహారంపై చర్చించారు. విస్తృతంగా అమలవుతున్న పథకాల పూర్తి వివరాలను అందరికీ తెలిసేలా చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు.