నేడు రాష్ట్రపతిని కలవనున్న సీఎం చంద్రబాబు - రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్
నేడు సీఎం చంద్రబాబు రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిసి వినతిపత్రం సమర్పించనున్నారు.

దీక్ష అనంతరం దిల్లీలోనే బసచేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు... ఇవాళ రాష్ట్రపతిని కలవనున్నారు. నేతలందరితో కలిసి రాష్ట్రపతి భవన్ వరకు కాలినడకన ర్యాలీగా వెళ్లనున్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించనున్నారు. చేసిన తప్పును సరిదిద్దుకోవలసిందిగా కేంద్రానికి మరోసారి విజ్ఞప్తి చేయనున్నారు. దీక్షకు మద్దతు తెలిపిన వారందరికీ చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏకాకులు కారని.. దేశం మొత్తం అండగా ఉందన్న విషయం స్పష్టమైందని చంద్రబాబు చెప్పారు. అమరావతిలో చివరి ధర్మపోరాట దీక్ష నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు.