పార్టీ నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. బీసీ సభలో జగన్ ఫ్రస్ట్రేషన్ తో మాట్లాడరని... తెదేపాకు వెన్నుదన్ను బీసీలేనని..అది వైకాపాకు మింగుడుపడట్లేదన్నారు. బీసీ ఉప ప్రణాళికకు తెదేపా చట్టబద్ధత కల్పించామని ఎప్పుడో ప్రకటిస్తే..మళ్లీ చట్టబద్ధత కల్పిస్తామని జగన్ మాట్లాడటం అవగాహన రాహిత్యానికి నిదర్శమన్నారు. జయహో బీసీ పెట్టి తాము విజయవంతం చేశామన్నారు. అందుకే జగన్ నిన్న హడావిడిగా సభపెట్టి ఏది పడితే అది మాట్లాడారన్నారు.
'జగన్కు కన్నా అద్దె మైకు'
తెదేపాకు వెన్నుదన్ను బీసీలేనని...అది వైకాపాకు మింగుడుపడట్లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
పార్టీ నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ జగన్ కు అద్దె మైకని చంద్రబాబు విమర్శించారు. ఐవీఆర్ ఎస్ ద్వారా అందరి అభిప్రాయాలు స్వీకరిస్తున్నామని సీఎం తెలిపారు. 2019-2024 ఉత్తమ బృందాన్ని ఎంపిక చేస్తున్నామన్నారు. ఎన్నికల కౌంట్ డౌన్ ప్రారంభమైందని.. నేతలకు సీఎం చంద్రబాబు తెలిపారు . నేడో, రేపో కోడ్ అమల్లోకి వస్తుందన్నారు. అభ్యర్థులను త్వరలోనే ప్రకటిస్తామని సీఎం తెలిపారు.