"కర్నూలు ఏకపక్షం కావాలి" - కర్నూలు నేతలు
కర్నూలు, నంద్యాల లోక్సభ నేతలత సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. జిల్లాలో 2 ఎంపీ, 14 అసెంబ్లీ స్థానాల్లో తెదేపా గెలుపు ఏకపక్షం కావాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.
సీఎం చంద్రబాబు
కర్నూలు, నంద్యాల పార్లమెంటు స్థానాల నేతలతో అమరావతిలోసీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. కర్నూలు జిల్లాలో 2 ఎంపీ, 14 అసెంబ్లీ స్థానాల్లో తెదేపా గెలుపు ఏకపక్షం కావాలని సీఎం సూచించారు. నేతల మధ్య విభేదాలను పక్కన పెట్టి పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. జిల్లాలో గతంలో ఎన్నడూ లేనంత బలంగా పార్టీ ఉందన్న చంద్రబాబు విభేదాలు మరిచి కార్యకర్తల్లో నూతన ఉత్తేజం నింపాలని కోరారు.