ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జేఈఈ ర్యాంకర్లకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు - చంద్రబాబు శుభాకాంక్షలు

జేఈఈలో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. మొదటి 24 మందిలో ఆరుగురు ఏపీ, తెలంగాణ విద్యార్థులే కైవసం చేసుకోవడం ముదావహమని అభిప్రాయపడ్డారు.

జేఈఈ ర్యాంకర్లకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

By

Published : Apr 30, 2019, 8:57 AM IST

జేఈఈ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ముందంజలో ఉండడం గర్వకారణమన్న చంద్రబాబు... రాష్ట్ర ఖ్యాతి దేశవ్యాప్తంగా ఇనుమడించిందని అభిప్రాయపడ్డారు. తొలి 10ర్యాంకుల్లో 3 ర్యాంకులు దక్కడం సంతోషదాయకమని హర్షం వ్యక్తం చేశారు. మొదటి 24 మందిలో ఆరుగురు ఏపీ, తెలంగాణ విద్యార్థులే కైవసం చేసుకోవడం ముదావహమన్న సీఎం... ఏటా 30 నుంచి 40 శాతం ర్యాంకుల్లో తెలుగు రాష్ట్రాలవారే ఉండటం అభినందనీయమన్నారు.

పరీక్షా విధానంలో మార్పులు వచ్చినా... పర్సంటైల్ విధానంలో... డెసిమల్ స్కోర్​లోనూ ముందుండటం తెలుగు విద్యార్ధుల ప్రతిభకు నిదర్శనమని చంద్రబాబు కొనియాడారు. అత్యుత్తమ ప్రతిభ చూపిన విద్యార్ధులకు, వారి తల్లిదండ్రులకు,ఉపాధ్యాయ బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

ర్యాంకర్లు వీరే...
నెల్లూరు జిల్లా నర్సాపురానికి చెందిన బట్టేపాటి కార్తికేయ, అనంతపురం పట్టణానికి చెందిన కొండా రేణు, విజయవాడకు చెందిన యెందుకూరి జయంత్ ఫణిసాయి, గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన బొజ్జా చేతన్​రెడ్డి వరుసగా 5,9,19,21 ర్యాంకులు సాధించారు.

ఇదీ చదవండి...

జేఈఈ మెయిన్స్​లో 24 మందికి 100కి వంద​

ABOUT THE AUTHOR

...view details