చట్టంలో రాష్ట్రానికి 11 సంస్థలు ఇచ్చారని... చిన్న రాష్ట్రాల్లో అంతకంటే ఎక్కువగా ఉన్నాయన్నారు. హైదరాబాద్‌లో, చెన్నై, బెంగళూరులో ఎన్ని సంస్థలున్నాయని ప్రశ్నించారు.
రాజకీయ లబ్ధి కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నారు: చంద్రబాబు - babu with pawar
భాజపా నాయకులు తప్పుడు ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
CM CHANDRABABU FIRES ON BJP LEADERS
ఏడాదికి రూ.5 వేల కోట్లకు పైగా పన్నులు కడుతున్నామన్న చంద్రబాబు..లోటు బడ్జెట్ ఇచ్చారా, పోలవరం పూర్తిచేశారా, రాజధానికి డబ్బులు ఇచ్చారా అని కేంద్రాన్ని ప్రశ్నించారు. కేంద్రం ఇవ్వకపోతే మా డబ్బులతో మేమే నిర్మించుకుంటామని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం అధికారులను 23 పార్టీలు కలిశాయని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే పేపర్ బ్యాలెట్‌కే వెళ్లాలని సూచించారు.