పేదలందరికీ ఇంటిపెద్దగా అండగా ఉంటానని హామీ ఇచ్చానట్లు గుర్తుచేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. కృష్ణా జిల్లా కేసరిపల్లిలో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన సీఎం... నాలుగేళ్లలో పింఛన్లను రూ.2వేలకు పెంచినట్లు తెలిపారు. పెరిగిన పింఛన్లతో వృద్ధులకు భద్రత పెరిగిందని అభిప్రాయపడ్డారు.
ఇంటిపెద్దగా నేనుంటా: చంద్రబాబు
నాలుగేళ్లలో పింఛన్లను రూ.2వేలకు పెంచామని.... పెరిగిన పింఛన్లతో వృద్ధులకు భద్రత పెరిగిందని అభిప్రాయపడ్డారు సీఎం చంద్రబాబు.
డ్వాక్రా సంఘాలను తానే పెట్టానని పునరుద్ఘాటించిన చంద్రబాబు.. మహిళలకు గుర్తింపు, ఆర్థిక స్వేచ్ఛ ఉండేలా చేస్తానని హామీఇచ్చారు. అభివృద్ధి జరుగుతున్నందునే భూములు ధరలు పెరిగాయన్న సీఎం...రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ పండగ కొనసాగుతుందని ఆనందం వ్యక్తం చేశారు.
పెంచిన ఫింఛన్లను లబ్ధిదారులకు నేరుగా అందిస్తామని పేర్కొన్నారు. మహిళలకు పసుపు- కుంకుమ పథకం వరం లాంటిదన్నారు. 3 విడతల్లో రూ.10 వేలు పంపిణీ చేస్తామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 93 లక్షల 81 వేల మంది మహిళలకు లబ్ధి చేకూరనున్నట్లు వివరించారు. రూ.9381 కోట్ల చెక్‌లు పంపిణీ చెసినట్లు చెప్పారు. 3 చెక్కులను ముందస్తు తేదీలతో ఒకేసారి ఘనత తెదేపా ప్రభుత్వానిదన్నారు.