ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భాజపా పాలన కంటే అత్యవసర పరిస్థితి నయం:చంద్రబాబు - chandrababu

'గవర్నర్‌ వ్యవస్థను మేము వ్యతిరేకిస్తున్నాం. ఐఏఎస్‌, ఐపీఎస్‌లు అందరినీ నియంత్రించాలని అనుకుంటున్నారు. దీనిని అడ్డుకుంటాం. నాలుగున్నరేళ్ల భాజపా పాలన పూర్తిగా అవినీతిమయమైంది. బ్యాంకు రుణ ఎగవేతదారులను దగ్గరుండి దేశం దాటించారు. అమిత్​షా కుమారుడి సంస్థ షేర్లు విలువ అమాంతం వేల రెట్లు ఎలా పెరిగిందిట' -చంద్రబాబు

babu

By

Published : Feb 5, 2019, 9:11 PM IST

kolkata
దేశాన్ని రక్షించేందుకు భాజపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలందరూ పోరాడాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. కోల్​కతా వెళ్లి మమతా బెనర్జీ ధర్నాకు సంఘీభావం తెలిపిన చంద్రబాబు... కేంద్రంపై విమర్శనాస్త్రాలు సంధించారు. కేంద్ర సంస్థలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న సంస్థలను మోదీ ప్రభుత్వం నియంత్రించాలని అనుకుంటోందని మండిపడ్డారు. రఫేల్ బప్పందం, సీబీఐ వివాదం, బ్యాంకు రుణాల ఎగువేత ఇలా ఎన్నో కుంభకోణాలతో భాజపా ప్రభుత్వ పాలన అవినీతిమయమైందన్నారు.
దిల్లీలో చూసుకుందాం...
దీదీ ధర్నాకు కొనసాగింపుగా ఈ నెల 13 కానీ 14న దిల్లీలో నిరసన చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. పోరాటం ఉద్ధృతం చేసి భాజపా పాలనకు ముగింపు పలకాలని మమతాను కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన దీదీ.... దిల్లీలో చంద్రబాబు ఆధ్వర్యంలో విపక్షాలు తలపెట్టిన పోరాటానికి మద్దతు తెలిపారు.
kolkata

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details