'కేంద్రంలో ఇలాంటి ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదు' - kolkatha
'నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో కేంద్రంలో ఇలాంటి ప్రభుత్వాన్ని చూడలేదు. ఎన్డీఏ ప్రభుత్వ చర్యల వల్ల దేశ సమగ్రతకు భంగం వాటిల్లుతోంది. మోదీ, షా మినహా మిగతా వారంతా అవినీతిపరులనే ముద్ర వేస్తున్నారు': చంద్రబాబు
భాజపా లాంటి ప్రభుత్వాన్ని తన రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబీఐ చర్యలను ఖండిస్తూ కోల్కతాలో ధర్నా చేస్తున్న మమతా బెనర్జీని చంద్రబాబు కలిసి సంఘీభావం తెలిపారు. అన్ని విపక్ష పార్టీలను భాజపా నాశనం చేయాలని చూస్తోందని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాల్లో అభివృద్ధిని అడ్డుకోవాలని కేంద్రం చూస్తోందని విమర్శించారు. ఏపీ, బంగాల్, దిల్లీ రాష్ట్రాలను అభివృద్ధి పరంగా అణగదొక్కుతుందని మండిపడ్డారు. ఎన్డీఏ ప్రభుత్వ చర్యల వల్ల దేశ సమగ్రతకు భంగం వాటిల్లుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.