అమరావతి వేదికగా సీఎం చంద్రబాబు పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు చేసే పోరాటం అందరిలో స్ఫూర్తి నింపుతోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎవరు ఎలా ప్రచారం చేసినా మళ్లీ అధికారంలోకి వస్తున్నామని నేతలకు స్పష్టం చేశారు. ఈవీఎంలపై తెదేపా చేస్తున్న పోరాటం ఈనాటిది కాదని గుర్తు చేశారు. అధికారం కోసం కొన్ని పార్టీలు ఎన్ని అరాచకాలు చేయాల్లో అన్నీ చేశాయని అన్నారు. సార్వత్రిక ఎన్నికలు కాగానే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి తెదేపా అధినేత పిలుపునిచ్చారు.
స్థానిక పోరుకు సిద్ధమవ్వండి: నేతలతో చంద్రబాబు - చంద్రబాబు
అమరావతి వేదికగా సీఎం చంద్రబాబు పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజాస్వామ్యం కోసం తెదేపా చేస్తున్న పోరాటం అందరిలో స్ఫూర్తి నింపుతోందని చంద్రబాబు అన్నారు. ఎవరు ఎలా ప్రచారం చేసిన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది తెలుగుదేశమేనని ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు వివాదంపై సీఎం చంద్రబాబు నేతలతో చర్చించారు. తెలంగాణలో ఇంటర్ పరీక్షలూ సరిగా నిర్వహించలేదని విమర్శించారు. ఇంటర్ పరీక్షలపై తెలంగాణ సీఎం స్పందించకున్నా ఎవరూ నోరు మెదపటం లేదని... రాష్ట్రంలో ఏదైనా చేస్తే నానా యాగీ చేస్తున్నారు ఆక్షేపించారు. ఈసీ ఇష్టానుసారం వ్యవహరిస్తే పాలన అస్తవ్యస్తమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారుల సాయంతో అనేక రంగాల్లో ప్రథమ స్థానంలో నిలిచామని...కానీ ఈసీ రూపంలో అధికారుల మధ్య చీలిక తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని నేతలతో అన్నారు.