విజయవాడ చేరుకున్న సీజేఐ - AMARAVATHI HIGH COURT
అమరావతిలో హైకోర్టు తాత్కాలిక భవనం ప్రారంభోత్సవంలో పాల్గొననున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ విజయవాడ చేరుకున్నారు.
CJI REACHES VIJAYAWADA
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ విజయవాడలోని నోవాటెల్ హోటల్‌కు చేరుకున్నారు. ఆదివారం అమరావతిలో హైకోర్టు తాత్కాలిక భవనం ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు. హైకోర్టు రిజిస్ట్రార్లు.. సీజేఐ, న్యాయమూర్తులకు స్వాగతం పలికారు. పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. సీజేఐతో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సుభాష్ రెడ్డి ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు.