శాంతిభద్రతలకు విఘాతం కలిగితే ఊరుకోం - report
ఎన్నికల సమయంలో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఈసీ ఆరా తీసింది. వైఎస్ వివేకానంద మృతి, తిక్కారెడ్డిపై దాడి ఘటనలపై నివేదిక కావాలని పోలీసులను ఆదేశించింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగితే ఊరుకోమని హెచ్చరించింది
గోపాలకృష్ణ ద్వివేది
వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఘటనపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఆరా తీసింది. హత్యకు దారితీసిన కారణాలేమిటో తెలుసుకోవాలని పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు కడప జిల్లా ఎస్పీతో మాట్లాడిన సీఈవో గోపాలకృష్ణ ద్వివేది...శాంతిభద్రతల విషయంలో రాజీపడవద్దని పోలీసులకు ఆదేశించారు. రాయలసీమలో శాంతిభద్రతలపై ఆయా జిల్లాల ఎస్పీలతో సమీక్షించిన సీఈవో... శాంతిభద్రతలకు విఘాతం కలిగితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. కర్నూలు జిల్లా మంత్రాలయం ఘటనపైనా నివేదిక కోరారు.