చంద్రబాబు వ్యవహారశైలి భిన్నంగా ఉంది: శ్రీకాంత్‌రెడ్డి - babu
మూడు రోజులుగా చంద్రబాబు వ్యవహారశైలి భిన్నంగా కనిపిస్తుందని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. పీపీఏల విషయంలో చంద్రబాబు అనవసర రాద్ధాంతం చేస్తున్నారన్నారు. విద్యుత్‌ను తక్కువ ధరకు కొనుగోలు చేయాలని సీఎం యోచిస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు.
పీపీఏల విషయంలో ముఖ్యమంత్రి జగన్ తక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేయాలని చూస్తుంటే.. చంద్రబాబు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. 2 రూపాయలకే సంప్రదాయేతర విద్యుత్ ఇస్తామంటే కాదని.. గత ప్రభుత్వం 5 రూపాయలకు విద్యుత్‌ను కొనుగోలు చేసిందని అన్నారు. మూడు రోజులుగా చంద్రబాబు వ్యవహారశైలి భిన్నంగా కనిపిస్తోందని శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. విద్యుత్ కొనుగోలులో అవినీతికి పాల్పడినందుకే ఆయన కంగారు పడుతున్నారని ఆరోపించారు.