ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ధర్మపోరాట నిరసనలు చేయండి' - amaravathi

ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్ర పర్యటనకు వ్యతిరేకంగా...నిరసనలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

టెలీకాన్ఫరెన్స్​లో మాట్లాడుతున్న చంద్రబాబు

By

Published : Mar 1, 2019, 9:52 AM IST

Updated : Mar 1, 2019, 10:07 AM IST

టెలీకాన్ఫరెన్స్​లో మాట్లాడుతున్న చంద్రబాబు

రాష్ట్రానికి ప్రధాని మోదీ రాకను నిరసిస్తూ ఎక్కడికక్కడ ధర్మపోరాట నిరసనలు చేయాలని... పార్టీ నేతలకు సీఎం చంద్రబాబు సూచించారు. అమరావతి నుంచి పార్టీ శ్రేణులతో టెలీకాన్ఫరెన్స్​లో మాట్లాడిన చంద్రబాబు... మోదీ విశాఖ పర్యటన మరో కుట్రని పేర్కొన్నారు. విశాఖ జోన్ ప్రకటన ఓ మాయా జోన్ అని అభిప్రాయపడ్డారు. 5 కోట్ల మంది నిరసన ఇవాళ ప్రతిబింబించాలన్నారు. 12 పార్లమెంటు నియోజకవర్గాల సమీక్షలు పూర్తిచేసుకున్నామన్న సీఎం... ఇంకో 13 నియోజకవర్గాల సమీక్ష త్వరలోనే పూర్తిచేస్తామని చెప్పారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన మరో 5-6 రోజుల్లో వచ్చే అవకాశం ఉందని... నేతలందరు ప్రజల్లోనే ఉండాలని ఆదేశించారు.

Last Updated : Mar 1, 2019, 10:07 AM IST

ABOUT THE AUTHOR

...view details