ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపా దాడులను ప్రజల్లో ఎండగట్టాలి: చంద్రబాబు - శాసన సభ

శాసనసభ, మండలి సభ్యులు సమన్వయంతో పని చేయాలని తెదేపా అధినేత చంద్రబాబు సూచించారు. చేసే విమర్శలు సహేతుకంగా, నిర్మాణాత్మకంగా ఉండాలని తెలిపారు. శాసనమండలిలో తమకే బలం ఉందని గుర్తు చేశారు.

http://10.10.50.85:6060///finalout4/andhra-pradesh-nle/finalout/11-June-2019/3534163_babu.JPG

By

Published : Jun 11, 2019, 9:41 PM IST

తెదేపాపై అవినీతి బురద చల్లితే తిప్పికొట్టాలని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలతో సమావేశమైన ఆయన.. ప్రతి శాఖలో జరిగే కార్యక్రమాలను అధ్యయనం చేయాలని నేతలకు సూచించారు. జీవోలను విశ్లేషించి..క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. వైకాపా భయపెట్టడం, దాడులకు పాల్పడితే...మౌనంగా ఉండలేమని హెచ్చరించారు. తప్పుడు కేసులు బనాయిస్తారని...అన్ని ఎదుర్కోనేలా ధైర్యంగా ఉండాలన్నారు. ఎక్కడికక్కడ సంఘీభావ ర్యాలీలు నిర్వహించాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details