కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోడాతో సమావేశం అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సహా.. జాతీయ నాయకులు మీడియాతో మాట్లాడారు. నేతలు ఎవరేమన్నారో వారి మాటల్లోనే...
ఈవీఎంలపై పదేళ్లుగా పోరాటం చేస్తున్నాం. 5 వీవీప్యాట్ స్లిప్పుల లెక్కించాక తేడా వస్తే ఏం చేస్తారు..? అసెంబ్లీ నియోజకవర్గంలోని మొత్తం వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించాలి. ఈవీఎంలో ఓట్లు, వీవీప్యాట్ స్లిప్పులు సరిపోవాలి. అభ్యర్థులు కోరినచోట ఓట్లను మళ్లీ లెక్కించాలి. పారదర్శకత ఉంటే వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించేందుకు ఇబ్బంది ఏమిటి..? - చంద్రబాబు, ముఖ్యమంత్రి