ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నివేదికలు, సర్వేలు తెదేపాకే అనుకూలం: బాబు - babu with media

నివేదికలు, సర్వేలు తెలుగుదేశం పార్టీకే అనుకూలంగా ఉన్నాయని... ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. ప్రతిపక్షాలు మైండ్ గేమ్ ఆడుతున్నాయని ఆరోపించారు. అమరావతిలోని ప్రజావేదికలో సీఎం చంద్రబాబు మీడియా సమావేశంలో మాట్లాడారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు

By

Published : May 5, 2019, 1:30 PM IST

ముఖ్యమంత్రి చంద్రబాబు

నివేదికలు, సర్వేలు తెదేపాకు అనుకూలంగా ఉన్నాయని... సంక్షేమ పథకాలు తమ విజయానికి కీలకం కానున్నాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతిలోని ప్రజావేదికలో చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ... ఇంత అభివృద్ధి చేశాక ఓటు వేయకపోతే రాజకీయాలకు అర్థం లేదన్నారు. అభివృద్ధి పనులను అందరూ పట్టించుకుంటే విజయం ఒక వైపే ఉంటుందన్న చంద్రబాబు... తాత్కాలిక ప్రలోభాలకు ఆశపడితే శాశ్వత అభివృద్ధి ఉండదని అన్నారు.

ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తరాఖండ్ ప్రత్యేక రాష్ట్రాలుగా విడిపోయాయన్న సీఎం... ఆ రాష్ట్రాలకు ఆమోదయోగ్య ప్యాకేజీ ఇచ్చారని గుర్తుచేశారు. ఇక్కడ రాజధాని లేకుండా ఆంధ్రప్రదేశ్‌ విడిపోయిందని అన్నారు. ప్రధాని మోదీ ఆనాడు కల్లబొల్లి మాటలు చెప్పారన్న చంద్రబాబు... ప్రధాని చెప్పే మాటలకు.. చేసే పనులకు సంబంధం లేదన్నారు. ముఖ్యమంత్రి పదవి కోసమే వైకాపా పుట్టిందని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టు సమీక్షకు ఎన్నికల కోడ్ అడ్డంకి కాదని సీఎం స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details